IGNOU | ఇగ్నో ప్లానింగ్ బోర్డు సభ్యునిగా ప్రొఫెసర్ వెంకటరమణ నియామకం
IGNOU | ఇగ్నో ప్లానింగ్ బోర్డు సభ్యునిగా ప్రొఫెసర్ వెంకటరమణ నియామకం
మూడేండ్లు సర్వీసులో కొనసాగనున్నయూవోహెచ్ ప్రొఫెసర్
Hyderabad : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (University of Hyderabad) (UoH) సీనియర్ ప్రొఫెసర్ వి వెంకటరమణ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) ప్లానింగ్ బోర్డు ఛైర్మన్‌గా నియమితులయ్యారు. ఆయన సభ్యునిగా మూడేండ్లు కొనసాగనున్నారు. ఆ యూనివర్సిటీలో తీసుకురావాల్సిన మార్పులు చేర్పులపై ఎప్పటికప్పుడు ప్లానింగ్ బోర్డు ఆధ్వర్యంలో కసరత్తు జరుగుతుంది. ఉన్నత విద్యా రంగంలో కోర్సుల రూపకల్పనలో కీలకంగా పని చేస్తుంది. నూతన విధానాలపై అధ్యయనం చేస్తుంది. ప్రొఫెసర్ వెంకటరమణ తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌గా దాదాపు ఏడు సంవత్సరాలు కొనసాగారు. రెండు సంవత్సరాలు బాసరలో ని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ) ఇన్ ఛార్జ్ వైస్ ఛాన్స్ లర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఆయన పదవి కాలం ముగియడంతో తిరిగా యూవోహెచ్‌లో చేరారు.
* * *
Leave A Comment